తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద ఊహించని ఘటన జరిగింది. హిందువులకు వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలంటూ బీజేవైఎం శ్రేణులు తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ధర్నా చేశాయి. అనంతరం లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత ఏర్పడింది. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.