హైదరాబాద్‌లో పలు మతపరమైన కార్యక్రమాల్లో డీజేల వినియోగంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన.. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. పాల్గొన్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే డీజేలు బ్యాన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. తమ నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగా సమావేశం నిర్వహించారంటూ అసహనం వ్యక్తం చేశారు. డీజేలు కచ్చితంగా పెట్టుకుంటామని.. ఏం చేసినా పర్వాలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.