నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని భరత్ చంద్ర పాఠశాలలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక బీజేపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు.. పాఠశాల లోపలికి దూసుకెళ్లి ప్రిన్సిపాల్‌పై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ గొడవ జరగడం గమనార్హం. తమ పిల్లలకు ఉర్దూ పాటలు, కల్మా నేర్పుతున్నారని.. వారి పుస్తకాల్లో ఉర్దూ రాతలు ఉన్నాయని బీజేపీ నేతలు, తల్లిదండ్రులు ఆరోపించారు. స్కూల్‌కు వెళ్లి పాఠశాలలో టీచర్, కరస్పాండెట్‌పై దాడి చేశారు.