హిజ్రాల ఆగడాలకు చెక్..! ఇక శుభకార్యాలయాలు, ఫంక్షన్ హాల్స్‌కు రావాలంటే వణికిపోవాలి..

5 months ago 10
సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిజ్రాల ఆగడాలపై జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్పందించారు. సుమారు 60 మంది హిజ్రాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. శుభకార్యాలయాలు, ఫంక్షన్ హాళ్ల వద్ద ప్రజలను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, రోడ్లపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకు ఉపేక్షించినా.. ఇకపై ఉల్లంఘిస్తే శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. కష్టపడి పని చేసుకుని గౌరవంగా జీవించాలని వారికి సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Read Entire Article