హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో మరో పెళ్లి బాజా మోగనుంది. నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వివాహం డిసెంబర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లికి సిద్ధమయ్యాడు. అఖిల్, జైనబ్ రావ్‌జీ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోనే అక్కినేనివారి ఇంట జరిగింది. ఈ ఫోటోలను నాగార్జున పంచుకున్నారు. దీంతో ఎవరీ జైనబ్ రావ్‌జీ అంటూ ఫ్యాన్స్ నెట్టింట తెగ వెతికేస్తున్నారు. జైనబ్ రావ్‌జీతో పాటుగా ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జైనబ్ రావ్‌జీ తండ్రి.. అఖిల్‌కు కాబోయే మామ జుల్ఫీ రావ్‌జీ వైసీపీ హయాంలో కీలక పోస్టులో పనిచేశారు.