గతంలో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ అనుమతులు లేవని జీహెచ్‌ఎంసీ కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నాగార్జున స్వయంగా ఆ చెరువు అభివృద్ధికి రెండెకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు. నగర అభివృద్ధిలో తాను కూడా హీరోలా ఉండాలనుకుంటున్నానని నాగార్జున చెప్పారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శేరిలింగంపల్లిలో నిర్మించిన కొత్త ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.