హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లోని చారిత్రాత్మక బౌద్ధ, జైన క్షేత్రాలను అనుసంధానం చేస్తూ అంతర్జాతీయ స్థాయి పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయడానికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హుస్సేన్‌సాగర్ బుద్ధ విగ్రహం, నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం, ఫణిగిరి, నేలకొండపల్లి బౌద్ధ స్తూపాలతో పాటు కొలనుపాక జైన మందిరాన్ని కలుపుతూ ఒకటి, రెండు రోజుల ప్యాకేజీలను రూపొందిస్తున్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద అధునాతన స్కైవాక్, బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం ఏర్పాటు ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఆకర్షణలు.