హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భరతమాతకు మహా హారతి వేడుకల్లో భాగంగా.. కొందరు బాణాసంచా కాల్చారు. కాగా.. ఆ బాణాసంచా మిరుగులు హుస్సేన్ సాగర్‌లో ఉన్న బోట్లపై పడగా.. ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో.. 2 బోట్లు కాలిబూడిదవుతున్నాయి. బోట్లలో ఉన్న పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది.