హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) అధికారి, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య ఉప్పల్ స్టేడియం కాంప్లిమెంటరీ పాస్‌లు ఇచ్చే అంశంపై తలెత్తిన వివాదం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. హెచ్సీఏ, ఎస్సార్‌హెచ్ వివాదంపై విచారణ చేపట్టాలని కీలక ఆదేశాలు చేశారు. హెచ్‌సీఏ బెదిరించిందో లేదో విజిలెన్స్ ఎంక్వయిరీ జరుగుతుంది.