శిథిలావస్థకు చేరిన ఉస్మానియా ఆస్పత్రి కోసం గోషామహల్ పరేడ్ గ్రౌండ్స్‌లో కొత్త భవనం నిర్మించ తలపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మేరకు.. రేపు (జనవరి 31న) ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కాగా.. ఈ కొత్త ఆస్పత్రి భవనాన్ని సకల సదుపాయాలతోనే కాకుండా అత్యాధునిక హంగులతో నిర్మించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఎస్టీపీ ప్లాంట్‌తో పాటు హెలీప్యాడ్ లాంటి అత్యాధునిక సదుపాయాలను ప్రభుత్వం డిజైన్ చేస్తోంది.