తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి తొలి మంత్రి అయ్యే అవకాశం ఆయనకు దక్కింది. ఏఐసీసీ (AICC) నుంచి అనుమతి లభించడంతో.. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకారం కోసం రాజ్‌భవన్‌లో అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. మైనార్టీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.