పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా ఈ నెల 04న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగి తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనపై హీరో అల్లు అర్జున్ టీమ్ మీద, సంధ్య థియేటర్ యాజమాన్యం మీద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కాగా.. అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఓనర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పెట్టిన కేసు కొట్టేయ్యాలంటూ అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేయగా.. అసలు ఆ ఘటనతో సంబంధమే లేదంటూ సంధ్య థియేటర్ ఓనర్ కూడా పిటిషన్ దాఖలు చేశారు.