స్థానిక సంస్థల్లో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారంపై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీని రంగంలోకి దింపింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి.. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు.. మంత్రులు, ఇతర నేతలతోనూ ముఖ్యమంత్రి భేటీ అయి.. రిజర్వేషన్లు, కోర్టులో విచారణకు సంబంధించిన విషయాలపై చర్చించారు.