హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపైకి బుల్డోజర్లను పంపిస్తున్న హైడ్రాపై విమర్శలు ఇంకా ఆగటం లేదు. తాజాగా.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. హైడ్రా అంటే కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ అని.. సోషల్ మీడియాలో, మీడియాలో హల్చల్ చేయటం తప్పా.. చేసే పనేమి లేదని సబితా చెప్పుకొచ్చారు. హైడ్రా అంటేనే ఒక డ్రామా అని.. దాని గుట్టు త్వరలోనే రట్టు చేస్తానంటూ సబితా ఇంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.