'కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుంది.. అందుకే నాపై కేసు పెట్టారు.' అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. రంగనాథ్‌పై తాను సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్ ఘటనలో హైడ్రా ఎమ్మెల్యేపై కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన దానం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.