హైడ్రా కూల్చివేతల బాధితులకు పరిహారం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఆయా బిల్డర్ల నుంచి డబ్బులు రికవరీ చేసి బాధితులకు ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తోందట. కూల్చివేతల విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో ఈ నిర్ణయం వైపు మెుగ్గు చూపుతున్నట్లు తెలిసింది.