భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతోన్న వేళ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మెగా బ్రదర్ నాగబాబు ప్రశంసలు గుప్పించారు. హైడ్రాను తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డికి మద్దతు పలికిన నాగబాబు.. ముఖ్యమంత్రి రేవంత్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. చెరువులు, నాళాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతోనే అపార్ట్‌మెంట్లు సైతం నీట మునుగుతున్నాయన్న నాగబాబు.. పర్యావరణాన్ని మనం భక్షిస్తే అది మనల్ని భక్షిస్తుందని హెచ్చరించారు.