Hydra NOC: అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక బాధ్యత అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై హైడ్రా నుంచి NOC ఉంటేనే నిర్మాణాలు చేపట్టేలా చట్ట సవరణ చేయనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో చెరువులు, నాలాలకు సమీపంలో భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇదొక మంచి నిర్ణయమని, ఇది అమల్లోకి వస్తే ఇళ్ల కొనుగోలుదారులకు ప్రయోజనం కలుగుతుందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.