హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మల్కాజిగిరి పరిధిలో కాంపౌండ్ వాల్‌ను కూల్చివేతలకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని అధికారులు కోర్టుకు చెప్పడంతో హైడ్రాకు కీలక ప్రశ్నలు సంధించింది. కోర్టు ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ కూల్చివేతలు చేపట్టడం ప్రాథమికంగా కోర్టు ధిక్కరణ అవుతుందని వ్యాఖ్యానించింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించి నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.