తెలంగాణలో అవయవ మార్పిడి లెక్కలు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. అవయవాలు దానం చేస్తారని ఎదురుచూస్తున్న ప్రతీ ఐదుగురు రోగుల్లో ఒకరు సరైన సమయానికి అవయవాలు అందక ప్రాణాలు కోల్పోతున్నట్లు వెల్లడైంది. ఇంకా అవయవాల కోసం దాదాపు 10 వేల మంది వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటం.. వారికి అవయవాలు ఇచ్చేవారు లేకపోవడం బాధాకరంగా మారింది. ముఖ్యంగా కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె వంటి అవయవాలకు భారీ డిమాండ్ ఉంది. దీంతో అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉందని అర్థం అవుతోంది.