ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ మరో కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో సుమారు రూ.16 వేల కోట్లతో టైటానియం ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ అంశంపై కరణ్ అదానీ నేతృత్వంలోని ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో చర్చించారు. రాష్ట్రంలోని బీచ్‌శాండ్‌లో లభించే ఇల్మెనైట్‌ను వినియోగించి టైటానియం ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే అవకాశాలను సమావేశంలో వివరించారు. దీంతో పాటు పలు ప్రతిపాదనలను కూడా సంస్థ ప్రతినిధులు ప్రభుత్వం ముందుంచారు.