హైదరాబాదీలకు న్యూ ఇయర్ గిఫ్ట్.. అక్కడి వరకూ మెట్రో.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్

3 weeks ago 3
నూతన సంవత్సరం తొలి రోజున హైదరాబాద్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మెట్రో పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైలును మేడ్చల్, శామీర్‌పేట్ వరకూ పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు 22 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. వెంటనే వీటికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Entire Article