హైదరాబాద్ ఓఆర్ఆర్‌కు మరో ఇంటర్‌చేంజ్ అందుబాటులోకి రానుంది. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డబుల్ డెక్కర్ ఇంటర్‌చేంజ్ నిర్మించనున్నారు. బుద్వేల్ ప్రాంతంలో రూ. 90 కోట్ల వ్యయంతో నాలుగు కారిడార్లుగా ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.