హైదరాబాద్ నగరవాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. ఇప్పటివరకు ఆ మార్గంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు ఇక రయ్‌మంటూ దూసుకెళ్లవచ్చు. ఇక ఎప్పటినుంచో నిర్మాణంలో ఉన్న అంబర్‌పేట్ ఫ్లైఓవర్ నిర్మాణం ఇప్పటికి పూర్తి అయింది. మహా శివరాత్రి సందర్భంగా ఈ అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వాహనదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే కింది భాగంలో కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి.