GHMC Y Saped Flyover RoB Project: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి జీహెచ్ఎంసీ రెండు కీలక ప్రాజెక్టులను ప్రతిపాదించింది. వీటిల్లో ఒకటి బేగంపేట-సర్దార్ పటేల్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి గాను 150 కోట్ల రూపాయల వ్యయంతో Y-ఆకారపు ఫ్లైఓవర్ నిర్మాణం కాగా.. మరొకటి 108.02 కోట్ల రూపాయల ఖర్చుతో.. పాటిగడ్డ రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ప్రయాణ దూరం తగ్గడమే కాక ట్రాఫిక్ సమస్య తీరుతుందని భావిస్తున్నారు.