హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసకుంది. న్యూ భరత్ నగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 8వ తరగతి విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాస్‌రూంలో పీఈటీ సార్ కొట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్తి సంగారెడ్డి బిల్డింగ్ పైనుంచి దూకి తనవు చాలించాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ధర్మారెడ్డి, సంగీతలు స్కూలుకు చేరుకొని గుండెలవిసేలా రోధించారు. ఈ ఘటన అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది. సంగారెడ్డి చావుకు కారణమైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తరపు బంధువులు, విద్యార్థి సంఘం నేతలు స్కూల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళన విరమింపజేశారు.