హైదరాబాద్‌కు ప్రపంచ ఈవీ దిగ్గజం టెస్లా.. నగరంలో వాహనాల సేల్స్, సర్వీస్ సెంటర్

3 months ago 16
ప్రపంచ ఈవీ దిగ్గజం 'టెస్లా' త్వరలోనే హైదరాబాద్‌లో సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో టెస్లా ప్రతినిధి బృందం భేటీ అయి తమ వ్యాపార విస్తరణ ఆసక్తిని వెల్లడించింది. ఇప్పటికే దేశంలో నాలుగు షోరూమ్‌లను ప్రారంభించిన టెస్లా.. ఐదో నగరంగా హైదరాబాద్‌ను ఎంచుకోవడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలోని అత్యాధునిక ఎకోసిస్టం ఆధారంగా టెస్లా మరిన్ని అనుబంధ పరిశ్రమలను ఇక్కడ విస్తరించాలని, ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
Read Entire Article