భవ్య పథకం కింద హైదరాబాద్ చుట్టూ నాలుగు కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు కానున్నాయి. తిమ్మాపూర్, ఎలిమినేడు, మాదారం, దండుమల్కాపూర్ ప్రాంతాల్లో వీటిని అభివృద్ధి చేయాలని టీజీఐఐసీ ప్రాథమికంగా నిర్ణయించింది. ఒక్కో ప్రాంతానికి ప్రత్యేక పారిశ్రామిక రంగాన్ని కేటాయించనున్నారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ రంగాలు, ఇంజినీరింగ్, ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కేంద్ర నిధులతో ఆధునిక మౌలిక వసతులు కల్పించి వేగంగా భూకేటాయింపులు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్ శివార్లలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది.