ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఏపీలోని ఒంటిమిట్ట సమీపంలోకి చేరుకోగానే.. సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు విమాన సిబ్బంది ప్రకటించారు.