హైదరాబాద్ జంట నగరాలకు కీలకమైన కృష్ణా ఫేజ్-1, 2, 3 పంపింగ్ స్టేషన్ల పరిధిలో నవంబర్ 26, బుధవారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ బల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్‌ల మార్పిడి పనుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని వాటర్ బోర్డు ప్రకటించింది. చార్మినార్, కూకట్‌పల్లి, ఎస్.ఆర్. నగర్, హయత్ నగర్, ఉప్పల్, మణికొండ వంటి 17 ప్రాంతాల్లో ఈ అంతరాయం ఉండనుంది. ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నీటిని నిల్వ చేసుకోవాలని వాటర్ బోర్డు సూచించింది.