HMWSSB: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జల మండలి అధికారులు వెల్లడించారు. నగరానికి నీటి సరఫరా చేసే పైప్‌లైన్ లీకేజీ కారణంగా వాటర్ సప్లయ్‌కు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. సాయంత్రానికి లీకేజీకి మరమ్మతులు పూర్తి చేస్తామని.. అప్పటి వరకు ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.