హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ప్రయాణికుల తాకిడి పెరగడంతో.. సికింద్రాబాద్‌కు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులోకి తెచ్చింది టీజీఎస్ ఆర్టీసీ. రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని సిటీ బస్సులను వివిధ ప్రాంతాలకు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 13 జతల రైళ్లు నడుస్తుండగా, త్వరలో మరో 12 రైళ్లు ప్రారంభించనున్నారు.