హైదరాబాద్ వాసులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. మరో సారి ప్రాపర్టీ ట్యాక్స్‌పై ఓటీఎస్ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. మెుత్తం 90 శాతం డిస్కాంట్ ప్రకటించగా.. ఈ స్కీమ్ కింది ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిదారులు కేవలం 10 శాతం వడ్డీతో పెండింగ్ డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఇప్పటికే ట్యాక్స్ కట్టిన వారికి ఈ 90 శాతం వచ్చే ఆర్థిక సంవత్సరంలో సెటిల్ చేయనున్నారు.