హైదరాబాద్ నగరానికి ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని తమ ప్రభుత్వం యత్నిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే నగర విస్తరణపై ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటుగా ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు. పెట్టుబడుల నగరంగా దాన్ని అభివృద్ధి చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.