హైదరాబాద్-బెంగళూరు మహానగరాలను అనుసంధానించే ప్రతిష్ఠాత్మక హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ ప్రాజెక్ట్ సర్వే తుది దశకు చేరింది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ ప్రాజెక్టు ఎలైన్‌మెంట్‌లో తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు కీలక మార్పులు చేశారు. కొత్త రూట్ మ్యాప్ ప్రకారం కోకాపేటలో ప్రారంభమయ్యే ఈ కారిడార్ శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, మన్ననూరు, సోమశిల ప్రకృతి సోయగాల మీదుగా ఏపీ, కర్ణాటకలకు సాగనుంది. తెలంగాణ పరిధిలో 205 కిలోమీటర్ల మేర సాగే ఈ మార్గంలో మొత్తం ఐదు హైస్పీడ్ స్టేషన్లను ప్రతిపాదించారు.