హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు షాకిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ రూ. 6,500 కోట్ల నష్టాల్లో కూరుకుపోవడంతో ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొన్ని రాయితీలను తొలగించిన సంస్థ.. బెంగళూరు మెట్రో తరహాలో ఛార్జీలను పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.