హైదరాబాద్ నగరవాసులకు మెట్రో గుడ్‌న్యూస్ చెప్పింది. రెండో విడత విస్తరణకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. మొత్తం ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాలను నిర్మించనున్నారు. నాగోల్-శంషాబాద్.. రాయదుర్గం-నియోపోలిస్.. ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట.. మియాపూర్-పటాన్‌చెరు.. ఎల్బీ నగర్-హయత్ నగర్ మార్గాల్లో మెట్రో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టుకు రూ.24,269 కోట్ల అంచనా వ్యయం అవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా.. దాని వల్ల పెరుగుతున్న ట్రాఫిక్‌ను పెరగకుండా ఉంచేందుకు ఈ మెట్రో రెండో దశ విస్తరణ చాలా కీలకం కానుంది.