హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్వరగా అనుమతులు సాధించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఐదు లోక్‌సభ స్థానాల పరిధిలో 76.4 కి.మీ. పొడవునా 54 స్టేషన్లతో ప్రతిపాదించిన మార్గాల వివరాలను ఎంపీలకు మెట్రో రైల్ సంస్థ అందజేసింది. చేవెళ్ల లోక్‌సభ స్థానంలో అత్యధికంగా 30 స్టేషన్లు రానుండగా.. భువనగిరిలో అత్యల్పంగా 3 స్టేషన్లు నిర్మించనున్నారు.