Shamshabad to Future City Metro Line: హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ పనులు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ డీపీఆర్ సిద్ధం కాగా.. అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. అయితే.. ఇప్పటికే అనుకున్నట్టుగా రెండో దశలో ఐదు కారిడార్లతో పాటు కొత్త మార్గానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. అదే.. శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సీటీ మెట్రో మార్గం. అంతేకాకుండా.. శంషాబాద్ మెట్రో మార్గంలోని అలైన్ మెంట్‌లో కూడా మార్పులు చేశారు.