హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి కొత్త చిక్కులు.. మరో మూడు నెలలు ఆలస్యం

10 hours ago 1
హైదరాబాద్‌ మెట్రోరైలు తొలిదశ స్వాధీన ప్రక్రియకు అవసరమైన రూ.13,600 కోట్ల రుణం ఇంకా ఖరారు కాకపోవడంతో జాప్యం తప్పడం లేదు. సెప్టెంబరు 30లోగా ఎస్‌పీఏ ప్రక్రియ పూర్తిచేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. రుణ సమీకరణ బాధ్యతను ఎస్‌బీఐ క్యాప్స్‌ చేపట్టి నాలుగు శాతం కంటే తక్కువ వడ్డీ కోసం సంస్థలను అన్వేషిస్తోంది. మరోవైపు ఐఆర్‌ఎఫ్‌సీతోనూ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఏప్రిల్‌లో ఎల్‌అండ్‌టీతో రూ.1,461.47 కోట్ల ఈక్విటీ కొనుగోలు ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం రోజుకు రూ.2.5 కోట్ల వడ్డీభారం ప్రభుత్వంపై పడుతోంది.
Read Entire Article