హైదరాబాద్ మెట్రోలో కొత్తగా 60 కోచ్‌ల కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పాత సిగ్నలింగ్ వ్యవస్థతో వాటిని అనుసంధానించే అంశం కీలకంగా మారింది. ప్రస్తుతం 57 మూడు కోచ్‌ల ట్రైన్ సెట్లు సేవలందిస్తున్నాయి. రద్దీ సమయాల్లో ఇవి సరిపోకపోవడంతో 10 కొత్త ట్రైన్ సెట్లను కొనుగోలు చేయనున్నారు. అయితే 12 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన సిగ్నలింగ్ వ్యవస్థకు అనుగుణంగా కొత్త కోచ్‌లు తయారు చేయడం కంటే.. పాత సిగ్నలింగ్, కంట్రోల్ వ్యవస్థను ఆధునికీకరించి కొత్త సాంకేతికతకు అనుగుణంగా మార్చడం మేలని డీఎంఆర్‌సీ సూచించినట్లు సమాచారం.