హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్ అందించింది. ఇకపై ప్రయాణికులు టికెట్ కొనుగోలు కోసం క్యూలైన్‌లో నిల్చొని ప్రయాస పడాల్సిన అవసరం లేదు. ప్రయాణికులు సులభతరంగా మెట్రో టికెట్లను గూగుల్ వ్యాలెట్ ద్వారా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. గూగుల్ వ్యాలెట్‌ను మెట్రో రైలు ఎండీ ఎస్వీఎస్ రెడ్డి మంగళవారం (నవంబర్ 5) ప్రారంభించారు.