తెలంగాణ ప్రజలు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న హైదరాబాద్-యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్‌తో పాటు కొమురవెల్లి, జోగులాంబ కొత్త రైల్వే స్టేషన్లపై కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే హైదరాబాద్-యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ మూడో ఫేజ్ ఫనులకు ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. అలాగే కొమురవెల్లి, జోగులాంబ రైల్వే స్టేషన్లు కూడా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.