హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం పనులపై సందిగ్ధత కొనసాగుతోంది. బిడ్లు తెరవటానికి జూన్ 18 డెడ్‌లైన్ కాగా.. జూన్ 19న టెండర్లు తెరవాల్సి ఉంది. అయితే నిర్మాణం విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ముందుగా 4 వరుసలుగా నిర్మించాలనుకున్నా.. ఆ తర్వాత 6 వరుసలుగా ప్రతిపాదన తీసుకురావటంతో నిర్మాణం విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది.