తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. వచ్చే మార్చిలో భూసేకరణ పూర్తి చేసి.. రానున్న నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. గతంలో ఓఆర్ఆర్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు తమ ప్రభుత్వమే నిర్మించిందని.. ఈ ప్రాజెక్టును సైతం తమ ప్రభుత్వమే పూర్తి చేస్తుందన్నారు.