హైదరాబాద్‌ను చుట్టి నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు పడింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దక్షిణ భాగం ఎలైన్‌మెంట్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం అనేక గ్రామాలు, మండలాలను కలుపుతుంది. ఇప్పటికే ఉత్తర భాగం పనులకు ఆమోదం లభించగా.. ఇప్పుడు దక్షిణ భాగానికి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రాజెక్టు వేగం పుంజుకోనుంది.