హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు వెంబడి రీజినల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారు. రీజినల్ రింగు రైలు కోసం 50 మీటర్ల భూసేకరణ అవసరం ఉంటుందని భావిస్తున్నారు. రైల్వే అధికారులు సాంకేతిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ చుట్టూ రవాణా, వ్యాపారాలు వృద్ధి చెంది, అపార ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా.