హైదరాబాద్‌లో రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు నెలలకు సరిపడా సన్నబియ్యం పంపిణీతో పాటు ఒక్కో కార్డుపై 5 కిలోల గోధుమలను రూ.7కే అందిస్తున్నారు. గతంలో రూ.15 వసూలు చేయగా.. ప్రస్తుతం రూ. 7కే కేజీ గోధుమలు ఇస్తున్నారు. అంతకు మించి అధిక ధరలు వసూలు చేస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని సివిల్ సప్లయ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ జరుగుతోంది. ఇటీవల 2 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో లబ్ధిదారుల సంఖ్య 3.10 కోట్లకు చేరింది.