రాష్ట్రంలో రేషన్ కార్డుల అనర్హుల జాబితాను గుర్తించే పనిలో అధికారులు పడ్డారు. విజిలెన్స్ అధికారులు రహస్యంగా ఆడిట్ నిర్వహించగా.. భారీగా అవకతవకలు ఉన్నట్లు తేలింది. దీంతో ఆ రేషన్ కార్డులను రద్దు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా రేషన్ కార్డు ద్వారా ఇప్పటివరకు పొందిన సబ్సిడీని కూడా రికవరీ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు రేషన్ కార్డుదారుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.