కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణలో అక్రమ వలసదారులపై నిఘా సంస్థలు జరిపిన విచారణలో విస్తుబోయే నిజాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్ నగరంలోనే దాదాపు 21,563 మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు తేలింది. వీరిలో 9,500 మంది రోహింగ్యాలు, 4 వేల మంది బంగ్లాదేశీయులు, 1,400 మంది ఆఫ్రికన్ జాతీయులు ఉన్నారు. తక్కువ జీవన వ్యయం, ఎక్కువ ఉపాధి అవకాశాల వల్ల వీరంతా హైదరాబాద్ బాట పట్టారు. ఈ నేపథ్యంలో రోహింగ్యాల నివాసం జాతీయ భద్రతకు తీవ్ర ఆందోళనకరమని నకిలీ గుర్తింపు పత్రాలు రద్దు చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.